Deenadayalo Deenadayalo In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Deenadayalo Deenadayalo Lyrics ॥

యమునా – చాపు (యమునాకల్యాణి – త్రిపుట)

పల్లవి:
దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో దీ ॥

చరణము(లు):
కనకాంబరధర ఘనశ్యామ దయాళో సనకాదిమునిజన వినుత దయాళో దీ ॥

శరధిబంధన రామచంద్ర దయాళో వరదామర బృందానంద దయాళో దీ ॥

నారదముని దేవనాథ దయాళో సారసాక్ష రఘునాథ దయాళో దీ ॥

దశరథసుత లోకాధార దయాళో పశుపతి చాపత్రుటిత దయాళో దీ ॥

ఆగమరక్షిత అమితదయాళో భోగిశయన పరమపురుష దయాళో దీ ॥

వరభద్రాద్రినివాస దయాళో అర్చిత శ్రీరామదాస దయాళో దీ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Ramude Galadu Napali In Telugu – Sri Ramadasu Keerthanalu