E Puraanamula Nenta Vedikinaa In Telugu

॥ E Puraanamula Nenta Vedikinaa Telugu Lyrics ॥

ఏపురాణముల నెంత వెదికినా ।
శ్రీపతిదాసులు చెడ రెన్నడును ॥

వారివిరహితములు అవి గొన్నాళ్ళకు ।
విరసంబులు మరి విఫలములు ।
నరహరి గొలి చిటు నమ్మినవరములు ।
నిరతము లెన్నడు నెలవులు చెడవు ॥

కమలాక్షుని మతిగాననిచదువులు ।
కుమతంబులు బహుకుపథములు ।
జమళి నచ్యుతుని సమారాధనలు ।
విమలములే కాని వితథముగావు ॥

శ్రీవల్లభుగతి జేరనిపదవులు ।
దావతులు కపటధర్మములు ।
శ్రీవేంకటపతి సేవించునేవలు ।
పావనము లధికభాగ్యపుసిరులు ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » E Puraanamula Nenta Vedikinaa Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Telugu » Tamil

See Also  108 Names Of Sri Vishwaksena In Tamil