E Teeruga Nanu Daya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Eteeruga Nanu Daya Choochedavo Lyrics ॥

నాదనామక్రియ – ఆది

పల్లవి:
ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా
నాతరమా భవసాగరమీదను నళినదళేక్షణరామా ఏ ॥

చరణము(లు):
శ్రీరఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నదికానుపు రామా ॥

మురిపెముతో నాస్వామివి నీవని ముందుగ దెల్పితి రామా
మరువక యిక నభిమానముంచు నీమరుగు జొచ్చితిని రామా ఏ ॥

క్రూరకర్మములు నేరకచేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారముచేయవె దైవశిఖామణి రామా ఏ ॥

గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ఏ ॥

నిండితి నీవఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీనామము దలచిన నిత్యానందము రామా ఏ ॥

వాసవకమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ఏ ॥

వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘురామా ఏ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Ye Theeruga Nanu Daya Choochedavo Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Yajnavalkya Ashtottara Shatanama Stotram In Telugu