Eda Nunnado In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Edanunnado na Paliramu Lyrics ॥

వరాళి – ఆది

పల్లవి:
ఏడనున్నాడో నా పాలిరాము
డేడనున్నాడో నా పాలిదేవు డేడనున్నాడో ఏ ॥

చరణము(లు):
ఏడనున్నాడో గానిజాడ తెలియరాదు
నాడు గజేంద్రుని కీడుబాపినతండ్రి ఏ ॥

ద్రౌణిబాణజ్వాల దాకిన బాలునికి
ప్రాణమిచ్చిన జగత్ప్రాణరక్షకుడు ఏ ॥

పాంచాలి సభలోన భంగమొందిననాడు
వంచనలేకను వలువలిచ్చినతండ్రి ఏ ॥

దూర్వాసుడుగ్రమున ధర్మసుతునిజూడ
నిర్వహించిన నవనీత చోరకుడు ఏ ॥

అక్షయముగ భద్రాచలమందున
సాక్షాత్కరించిన జగదేకవీరుడు ఏ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Eda Nunnado Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Parvatipanchakam Telugu Lyrics ॥ పార్వతీపఞ్చకమ్ ॥