Ekkadi Karmamuladdupadeno Yemiseyuduno In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ekkadi Karmamuladdupadeno Yemiseyuduno Lyrics ॥

కాంభోజి – ఆది (త్రిపుట)

పల్లవి:
ఎక్కడి కర్మములడ్డుపడెనో యేమిసేయుదునో శ్రీరామా
అక్కట నాకన్నుల నెప్పుడు హరి నినుజూతునో శ్రీరామా ఎ ॥

చరణము(లు):
ప్రకటమాయెను పాపములెటుల బాధకోర్తును శ్రీరామా
సకలలోక రాజ్యపదవికి ఎక్కువైనయట్టి శ్రీరామా ఎ ॥

పృథివిలోన పూర్వజన్మల పూజలింతేగా శ్రీరామా
విధులు జరుపవలయు విషయవాంచలు దలుపక శ్రీరామా ఎ ॥

మూడు నెలలాయె నీ మునుముందర నిల్వక శ్రీరామా
ఎన్నడిట్లుండి రాఘవ నేనెరుగ నను గన్నయ్యా శ్రీరామా ఎ ॥

కోరి భద్రాచలమున రాముని కొలుతునంటిని శ్రీరామా
కోర్కెలొసగి రామదాసుని గనుగొని రక్షింపుమంటి శ్రీరామా ఎ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Surya Ashtottara Shatanama Stotram In Telugu