Ennaganu Rama Bajana Kanna In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ennaganu Rama Bajana Kanna Lyrics ॥

పంతువరాళి – రూపక

పల్లవి:
ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ ॥

అను పల్లవి:
సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?
కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ ॥

చరణము(లు):
రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి
రామరామరామ యనుచు రమణియొకతె పల్కగా
ప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడు
కామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ ॥

శాపకారణము నహల్య చాపరాతి చందమాయె
పాపమెల్ల బాసె రామపదము సోకినంతనే
రూపవతులలో నధిక రూపురేఖలను కలిగియు
తాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Narottama Ashtakam In Telugu