Ento Mahanubhavudavu Neevu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ento Mahanubhavudavu Neevu Lyrics ॥

వరాళి – రూపక (శంకరాభరణ – త్రిపుట)

పల్లవి:
ఎంతో మహానుభావుడవు నీవు
ఎంతో చక్కని దేవుడవు ఎంతో ॥

వింతలు చేసితి వీలోకమందున
సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర ఎంతో ॥

చరణము(లు):
తొలివేల్పు జాంబవంతుని చేసినావు
మలివేల్పు పవనజుగా చేసినావు
వెలయ సూర్యు సుగ్రీవుగ చేసినావు
అలనెల్ల సురల కోతుల జేసినావు ఎంతో ॥

కారణ శ్రీ సీతగ జేసినావు
గరిమశేషుని లక్ష్మణుని జేసినావు
ఆ రెంటి భరత శత్రుఘ్నుల జేసినావు
నారాయణ నీవు నరుడవైనావు ఎంతో ॥

ఱాతికి ప్రాణము రప్పించినావు
నాతి యెంగిలికానందించినావు
కోతిమూకలనెల్ల గొలిపించినావు
నీటిపై కొండల నిల్పించినావు ఎంతో ॥

లంకపై దండెత్తి లగ్గెక్కినావు
రావణ కుంభకర్ణుల ద్రుంచినావు
పంకజాక్షిని సీత పాలించినావు
లంకేశు దివ్యపుష్పక మెక్కినావు ఎంతో ॥

పరగ నయోధ్యకు బరతెంచినావు
పట్టాభిషిక్తుడవై పాలించినావు
వర భద్రగిరియందు వసియించినావు
ధరను రామదాసు దయనేలినావు ఎంతో ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Devi Vaibhavashcharya – Ashtottara Shatanamavali In Telugu