Evaru Dusincina Nemi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Evaru Dusincina Nemi Lyrics ॥

బిళహరి – త్రిపుట

పల్లవి:
ఎవరు దూషించిన నేమి వచ్చె మరి
ఎవరు భూషించిన నేమి వచ్చె మరి
అవగుణములు మాన్పి ఆర్చేర తీర్చేర
నవనీతచోరుడు నారాయణుడుండగ ఎ ॥

చరణము(లు):
పిమ్మట నాడిన నేమి మంచి
ప్రియములు ఒలికిన నేమి కొమ్మిదే
రమ్మని కోరిక లొసగెడి నాపాల
సమ్మతిగ సర్వేశ్వరుడుండగ ఎ ॥

వారి పంతము మాకేల వట్టి
వాదులతోడ పోరేల భాషించు
వారితో పలుమారు పొందేల కాచి
రక్షించెడి ఘనుడు శ్రీరాముడుండగా ఎ ॥

అపరాధముల నెంచువారు మాకు
ఉపకారులై యున్నారు రామ
విపరీత చరితలు వినుచు ఎల్లప్పుడు
కపట నాటకధారి కనిపెట్టియుండగ ఎ ॥

వాసిగ ఏలువాని విధములు తలుపనేల
వాసనల భ్రమయనేల భద్రాద్రి
వాసుడై నిరతము భాసురముగ రామ
దాసు నేలిన వాడు దయతోడ నుండగ ఎ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Jogulamba Ashtakam In Telugu