Garuda Gamana Rara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Garuda Gamana Rara Lyrics ॥

యమునాకల్యాణి – ఆది
పల్లవి:
గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా
పరమపురుష యే వెరపులేకనీ మరుగుజొచ్చితి నరమరసేయకు గ ॥

చరణము(లు):
పిలువగానె రమ్మి అభయము తలపగానెయిమ్మి
కలిమి బలిమి నాకిలలో నీవని పలువరించితి నను గన్నయ్య గ ॥

పాలకడలి శయన దశరథబాల జలజనయన
పాలముంచు నను నీటముంచు నీ పాలబడితినిక జాలముచేయక గ ॥

ఏలరావు స్వామి ననునిపు డేలుకోవదేమి
ఏలువాడవని చాల నమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి గ ॥

ఇంతపంతమేల భద్రగిరీశ వరకృపాల
చింతలణచి శ్రీరామదాసుని అంతరంగపతివై రక్షింపుము గ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Garuda Gamana Rara Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Ardhanarishvara Ashtottara Shatanamavali In Telugu