భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Govinda Sundaramohana Dinamandara Lyrics ॥
మోహన – చాపు ( – త్రిపుట)
పల్లవి:
గోవింద సుందరమోహన దీనమందార
గరుడవాహన భవబంధాది దుష్కర్మ
దహన భక్తవత్సల త్రిలోకపావన గో ॥
చరణము(లు):
సతిసుతులపై ప్రేమరోసితి సం
తతము మీపై భారమువేసితి
మదిలోన మిముగనుల జూడగ నెంచి
మీదయకెపు డెదురెదురు జూచితి గో ॥
చాలదినములనుండి వేడితినే
కాలహరణముచేసి గనలేనైతి
మేలు నీనామముబాడితి
మేలుగా ముందటి విధమున వేడితి గో ॥
దీనరక్షకుడవని వింటిని నీ
కనికర మేతీరున గందును మానస
మున నమ్మియుందును నా
మనవి చేకొనవేమందును గో ॥
అధికుడవని నమ్మినందుకు ఆశ్ర
యించిన శ్రమపెట్టేదెందుకు మిము
వెదకి తెలిసేదెందుకు మాకిది
పూర్వకృత మనేటందుకు గో ॥
క్రోధాన వచ్చెను వార్ధక్యము ఇక
ప్రాపేది బహుసామీప్యము పదములు
విడనందు గోప్యమా మీరెపు
డు చూపెదరు స్వరూపము గో ॥
భద్రగిరియందు లేదేమొ యునికి
భక్తుల మొరవిని రావేమొ కరిగాచి
న హరివిగాదేమో రామ
దాసుని మొరవిని రావేమో గో ॥