Idigo Bhadradri In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Idigo Bhadradri Gautami Adigo Lyrics ॥

వరాళి – ఆది (మోహన – ఆది)

పల్లవి:
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి
ముదముతో సీత ముదిత లక్ష్మణులు
కలసి కొలువగా రఘుపతియుండెడి ఇది ॥

చరణము(లు):
చారుస్వర్ణప్రాకార గోపుర
ద్వారములతో సుందరమైయుండెడి ఇది ॥

అనుపమానమై యతిసుందరమై
దనరుచక్రమది ధగధగ మెరిసెడి ఇది ॥

కలియుగమందున నిలవైకుంఠము
నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ఇది ॥

పొన్నల పొగడల పూపొదరిండ్లతొ
చెన్నుమీరగను చెలగుచునున్నది ఇది ॥

శ్రీకరముగ శ్రీరామదాసుని
ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ఇది ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Idigo Bhadradri Gautami Adigo Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Shani Stotram (Dasaratha Kritam) In Telugu