Innikalgi Mirurakunna Nenevarivadanaudu Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Innikalgi Mirurakunna Nenevarivadanaudu Rama Lyrics ॥

కల్యాణి – చాపు ( – ఆది)

పల్లవి:
ఇన్నికల్గి మీరూరకున్న నేనెవరివాడనౌదు రామ ఇ ॥

అను పల్లవి:
కన్నతండ్రివలె రక్షించుటకును కరుణ యేలరాదు రామ ఇ ॥

చరణము(లు):
అక్షయమియ్యగ దలచిన శ్రీమహా
లక్ష్మీదేవి లేదా రామా
రక్షింపగ నెంచిన భూదేవియు
రత్నగర్భగాదా రామా ఇ ॥

పక్షపాత మెడలింపగ చేతిలో
పరుసవేది లేదా రామా
ఈ క్షణమున దయగలిగిన సంచిత
ధనమున్నది గాదా రామా ఇ ॥

కనుగొని నిర్హేతుక కృప జూచిన
కల్పతరువు లేదా రామా
మనవాడని నెనరుంచిన చింతా
మణియున్నది కాదా రామా ఇ ॥

పెనబడు వెతదీర్పను శరణాగత
బిరుదు నీదెకాదా రామా
వనజ భవాండము లేలుదొరలు దే
వరవారలె కాదా రామా ఇ ॥

కరిప్రహ్లాద విభీషణాదులను
గాచితివని వింటి రామా
హర సుర బ్రహ్మాదుల కంటెను నిను
నధికుడవని యంటి రామా ఇ ॥

సిరినాయక నీమరుగు జొచ్చితిని
శరణంబని యంటి రామా
కరుణతో భద్రాద్రి రామదాసుని
గావు మనియంటి రామా ఇ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Vrinda Devi Ashtakam In Telugu