Ippuditu Kalaganti In Telugu

॥ Kalaganti Kalaganti Telugu Lyrics ॥

ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు ।
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ॥

అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ।
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి ।
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి ।
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి ॥

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి ।
ఘనమైన దీపసంఘములు గంటి ।
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి ।
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి ॥

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి ।
సరిలేని యభయ హస్తము గంటి ।
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి ।
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Kalaganti Kalaganti Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Hanuman Kavacham In Tamil