Itarulaku Ninu In Telugu

॥ Itarulaku Ninu Telugu Lyrics ॥

ఇతరులకు నిను నెరుగదరమా ॥
సతతసత్యవ్రతులు సంపూర్ణమోహవిర-
హితులెరుగుదురు నిను నిందిరారమణా ॥

నారీకటాక్షపటునారాచభయరహిత-
శూరులెరుగుదురు నిను జూచేటిచూపు ।
ఘొరసంసార సంకులపరిచ్ఛేదులగు-
ధీరులెరుగుదురు నీదివ్యవిగ్రహము ॥

రాగభోగవిదూర రంజితాత్ములు మహా-
భాగులెరుగుదురు నిను బ్రణుతించువిధము ।
ఆగమోక్తప్రకారాభిగమ్యులు మహా-
యోగులెరుగుదురు నీవుండేటివునికి ॥

పరమభాగవత పదపద్మసేవానిజా-
భరణు లెరుగుదురు నీపలికేటిపలుకు ।
పరగునిత్యానంద పరిపూర్ణమానస-
స్థిరు లెరుగుదురు నిను దిరువేంకటేశ ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Itarulaku Ninu Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Ekashloki Bhagavatam In Tamil