Janakatanaya Nadu Manavigaikoni In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Janakatanaya Nadu Manavigaikoni Lyrics ॥

శహానా – చాపు

చరణము(లు):
జనకతనయ నాదు మనవిగైకొని జగజ్జనకునితో దెల్పవే ఓ జననీ
పనిపూని ననుపెట్టు బాధలన్నియును పాటించి మహి లెస్సగా ఓ జననీ జ ॥

పండ్రెండేండ్లనుండి పగలురేయి యాపన్నుడై మిమ్ములన్‌ ఓ జననీ
యెన్నెన్నో విధముల సన్నుతించిన కాని కన్నుల జూడరు ఓ జననీ జ ॥

కన్నీరు లేకుండ నుండు తీరు నాకు ఎన్నడు లేదుగదా ఓ జననీ
కన్నతండ్రులింత కరుణమాలి భువిని గాచువారలు గలర ఓ జననీ జ ॥

అజుని హరుని ప్రేమనాశ్రయించి నన్ను ఆదరించకపోదుర ఓ జననీ
గజరాజు మకరిచే గాసిజెంది వేడ గాచి రక్షింపలేదా ఓ జననీ జ ॥

నిజముగ మీపాదభజన చేసినవాని నిర్దయ జూచినారు ఓ జననీ
సుజనాళి మున్ను ఎటువలె బ్రోచిరో నిజముగాదని దోచెను ఓ జననీ జ ॥

అసిపత్రముల బూని యుగ్రులై నొసలిపై విసరుచుందురెప్పుడు ఓ జననీ
మిసమిసమను కోరమీసముల్దువ్వుచు కసిదీర నన్ను దూరిరి ఓ జననీ జ ॥

అశనిపాతముల నన్నలసట నొందగ విసరివిసరి గొట్టగా ఓ జననీ
వశముగాదు నిమిషమైన నోర్వజాల జలజాక్షి దిక్కెవ్వరే ఓ జననీ జ ॥

గడియగడియకు నన్ను కదిసి దూతలవలె కడుభీతినొందింపగా ఓ జననీ
ఎడతెగని యాపద ఈప్రొద్దు గలిగె నేనెవరితో విన్నవింతు ఓ జననీ జ ॥

తడవేల పైకము తెమ్మని తహశీలు తాఖీదు చేయింపగా ఓ జననీ
ఇడుములబడలేను ఉర్విపై ప్రాణములు విడిచి మిమ్ముజేరుదు ఓ జననీ జ ॥

See Also  Bhuvaneshwari Ashtottara Shatanama Stotram In Telugu

అదిగో వచ్చెదరని ఇదిగో వచ్చెదరని ఎదురుచూచుచుంటిని ఓ జననీ
ఒదిగి చిన్నపోయి బందిఖానాలో నేనొంటరిగా నుంటిని ఓ జననీ జ ॥

సుదతిరో తెల్లవారిన వెనుక నన్నింక బ్రతుకనియ్యరు భటులు ఓ జననీ
అతిభీతినొంది నేనర్థించితి నిమిషమాలస్య మికచేయక ఓ జననీ జ ॥

పరమపురుషుడింత యరమర చేసిన పరులనెవ్వరి వేడుదు ఓ జననీ
సరసిజోదరునకు సమ్మతిగాకున్న సత్కీర్తి దక్కునటే ఓ జననీ జ ॥

మరిమరి మిమ్మెపుడు మందలించి నామనసు నీరైపోయెగా ఓ జననీ
సరి నాయిష్టము చెల్లె నేటివరకు వెరపులన్నియు తీరెగా ఓ జననీ జ ॥

అతివరో యన్నదమ్ములనిటు పంపుమీ యర్థముతో గూడను ఓ జననీ
గతివేరేలేదు సద్గతినొందుటకును పతితపావనుడు దప్ప ఓ జననీ జ ॥

ఇతరమెరుగక మీరేగతియని నమ్ముక యిదివరకున్నాడను ఓ జననీ
సతతము భద్రాచలరామదాసుని తరియింప సమయము ఓ జననీ జ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Janakatanaya Nadu Manavigaikoni Lyrics in English

Other Ramadasu Keerthanas: