Janaki Ramana Kalyana Guna In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Janaki Ramana Kalyana Guna Lyrics ॥

పున్నాగవరాళి – ఆది (కాపి – త్రిపుట)

పల్లవి:
జానకిరమణ కళ్యాణసజ్జన నిపుణ, కళ్యాణసజ్జన నిపుణ శ్రీరామా జా ॥

చరణము(లు):
ఓనమాలు రాయగానే నీనామమే తోచు, నీనామమే తోచు శ్రీరామా జా ॥

ఎందుజూచిన నీదు అందమే గానవచ్చు, అందమే గానవచ్చు శ్రీరామా జా ॥

ముద్దుమోమునుజూచి మునులెల్ల మోహించిరి, మునులెల్ల మోహించిరి శ్రీరామా జా ॥

దుష్టులు నినుజూడ దృష్టితాకును ఏమో, దృష్టితాకును ఏమో శ్రీరామా జా ॥

ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవె, నిన్నే భజింప నీవె శ్రీరామా జా ॥

ముక్తి నేనొల్ల నీదు భక్తి మాత్రము చాలు, భక్తి మాత్రము చాలు శ్రీరామా జా ॥

రాతినాతిగజేసె నీతిరువడిగళెగాదా, నీతిరువడిగళెగాదా శ్రీరామా జా ॥

నారదాది మునులు పరమపద మందిరిగద, పరమపద మందిరిగద శ్రీరామా జా ॥

సత్యస్వరూపముగ బ్రత్యక్షమైనావు, బ్రత్యక్షమైనావు శ్రీరామా జా ॥

భద్రాచలనివాస పాలిత రామదాస, పాలిత రామదాస శ్రీరామా జా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Janaki Ramana Kalyana Guna Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Shambhustavah In Telugu – Telugu Shlokas