Jaya Janaki Ramana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Jaya Janaki Ramana Lyrics ॥

నాట – ఝంప

చరణము(లు):
జయజానకీరమణ జయ విభీషణశరణ
జయ సరోరుహచరణ జయ దనుజహరణ జ ॥

జయ త్రిలోకశరణ్య జయ భక్తకారుణ్య
జయ గణ్యలావణ్య జయ జగద్గణ్య జ ॥

సకలలోకనివాస సాకేతపురవాస
అకళంక నిజహాస అబ్జముఖహాస జ ॥

శుకమౌనిస్తుతపాత్ర శుభరమ్యచారిత్ర
మకరకుండలకర్ణ మేఘసమవర్ణ జ ॥

కమనీయకంఠీర కౌస్తుభాలంకార
కమలాక్ష రఘువీర కలుషసంహార జ ॥

సమదరిపుజయధీర సకలగుణగంభీర
అమలహృత్సంచార అఖిలార్తిహార జ ॥

రూపనిర్జితమార రుచిసద్గుణశూర
భూపదశరథపుత్ర భూభూరహార జ ॥

పాపసంగవిదార పంక్తిముఖసంహార
శ్రీపతే సుకుమార సీతావిహార జ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Jaya Janaki Ramana Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Sri Adilakshmi In Telugu