॥ Jwarahara Stotram Telugu Lyrics ॥
॥ జ్వరహర స్తోత్రం ॥
ధ్యానమ్ ।
త్రిపాద్భస్మప్రహరణస్త్రిశిరా రక్తలోచనః ।
స మే ప్రీతస్సుఖం దద్యాత్ సర్వామయపతిర్జ్వరః ॥
స్తోత్రం ।
విద్రావితే భూతగణే జ్వరస్తు త్రిశిరాస్త్రిపాత్ ।
[* పాఠభేదః –
మహాదేవప్రయుక్తోఽసౌ ఘోరరూపో భయావహః ।
ఆవిర్బభూవ పురతః సమరే శార్ఙ్గధన్వనః ॥
*]
అభ్యధావత దాశార్హం దహన్నివ దిశో దశ ॥
అథ నారాయణో దేవస్తం దృష్ట్వా వ్యసృజజ్జ్వరమ్ ॥ ౧ ॥
మాహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ ।
మాహేశ్వరః సమాక్రన్దన్వైష్ణవేన బలార్దితః ॥ ౨ ॥
అలబ్ధ్వాఽభయమన్యత్ర భీతో మాహేశ్వరో జ్వరః ।
శరణార్థీ హృషీకేశం తుష్టావ ప్రయతాంజలిః ॥ ౩ ॥
జ్వర ఉవాచ ॥
నమామి త్వాఽనంతశక్తిం పరేశం
సర్వాత్మానం కేవలం జ్ఞప్తిమాత్రమ్ ।
విశ్వోత్పత్తిస్థానసంరోధహేతుం
యత్తద్బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతమ్ ॥ ౪ ॥
కాలో దైవం కర్మ జీవః స్వభావో
ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికారః ।
తత్సంఘాతో బీజరోహప్రవాహ-
-స్త్వన్మాయైషా తన్నిషేధం ప్రపద్యే ॥ ౫ ॥
నానాభావైర్లీలయైవోపపన్నై-
-ర్దేవాన్సాధూన్లోకసేతూన్బిభర్షి ।
హంస్యున్మార్గాన్హింసయా వర్తమానాన్
జన్మైతత్తే భారహారాయ భూమేః ॥ ౬ ॥
తప్తోఽహం తే తేజసా దుఃసహేన
శాంతోగ్రేణాత్యుల్బణేన జ్వరేణ ।
తావత్తాపో దేహినాం తేఽంఘ్రిమూలం
నో సేవేరన్యావదాశానుబద్ధాః ॥ ౭ ॥
శ్రీ భగవానువాచ ॥
త్రిశిరస్తే ప్రసన్నోఽస్మి వ్యేతు తే మజ్జ్వరాద్భయమ్ ।
యో నౌ స్మరతి సంవాదం తస్య త్వన్నభవేద్భయమ్ ॥ ౮ ॥
ఇత్యుక్తోఽచ్యుతమానమ్య గతో మాహేశ్వరో జ్వరః ।
బాణస్తు రథమారూఢః ప్రాగాద్యోత్స్యంజనార్దనమ్ ॥ ౯ ॥
ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే త్రిషష్టితమోఽధ్యాయే జ్వరకృత కృష్ణస్తోత్రమ్ ।