Kaligenide Naaku In Telugu

॥ Kaligenide Naaku Telugu Lyrics ॥

కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది ॥

జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధి ।
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీదివ్యకీర్తనమే ॥

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన ।
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే ॥

నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా ।
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Kaligenide Naaku Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Paduka Ashtakam In Tamil