భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Kaliyuga Vaikuntamu Bhadracala Lyrics ॥
ఆనంద భైరవి – రూపక (- త్రిపుట)
పల్లవి:
కలియుగ వైకుంఠము భద్రాచల
నిలయము సేవింతము సేవింతము క ॥
అను పల్లవి:
అలివేణులారా మీరానందముగ వేగ
విలసితమైనట్టి వేడుకచూడరె క ॥
చరణము(లు):
కాంచన సౌధములు మానికములు మించిన దూలములు
వజ్రములు చెక్కించిన స్తంభములు
పగడములని భ్రమియించు ద్వారములు
అంచయాన మరియెంచ లేరు గాదె
మంచి పచ్చలు కూర్చిన వాకిళ్ళు క ॥
బంగారు గోపురములు దేవళముల వెలుగు మాణిక్యములు భేరి
మృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలు
రంగైన కల్యాణమంటపములు శృంగారమేమనిదెలియ విన్నవింతు క ॥
తీరైన పురవీధులు సొగసైన కోనేరులు సోపానములు సకలఫల
తరువు లుపవనములు నదులు ఋషి గంధర్వనివాసములు
సరసిజాక్షి వినవే గోదావరిస్నానము సంపత్కరమై యొప్పినది క ॥
చక్కని స్త్రీపురుషులు పట్టణమందు పిక్కటిల్లగ వింతలు బ్రాహ్మణులు
మక్కువతో పూజలు వేదశాస్త్ర తార్కిక వైష్ణవులు
గ్రక్కునవారిని కన్నులజూచిన ఎక్కువైన పుణ్యమేమని తెలుపుదు క ॥
వామాక్షులాడగను సీతతో హేమపీఠమున సంపూర్ణకళలు
మోమున వెలుగగ పరివారములు ప్రేమతో గొలువగను భద్రాద్రి
రామదాసునేలు స్వామియైన శ్రీకోదండరాము నివాసము క ॥