Kanti Nedu Ma Ramula Kanugonti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Kanti Nedu Ma Ramula Kanugonti Lyrics ॥

శంకరాభరణ – చాపు (మేచబౌళి – ఝంప)
పల్లవి:
కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం ॥

చరణము(లు):
కంటి నేడు భక్తగణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం ॥

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువుతీరిన మా కోదండరాముని కం ॥

తరణికులతిలకుని ఘననీలగాత్రుని
కరుణా రసము గురియు కందోయి గలవాని కం ॥

హురు మంచి ముత్యాల సరములు మెరయగా
మురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం ॥

ఘల్లు ఘల్లుమని పైడి గజ్జెలందెలు మ్రోయగ
తళుకుబెళుకు పాదతలము గలిగినవాని కం ॥

కరకు బంగారుచేల కాంతి జగములు గప్ప
శరచాపములు కేల ధరియించు స్వామిని కం ॥

ధరణిపై శ్రీరామదాసునేలెడు వాని
పరమపురుషుడైన భద్రగిరిస్వామిని కం ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Kanti Nedu Ma Ramula Kanugonti Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  967 Names Of Sri Pratyangira – Sahasranamavali Stotram In Telugu