Karuna Judave O Yamma In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Karuna Judave O Yamma Lyrics ॥

సౌరాష్ట్ర – త్రిపుట

పల్లవి:
కరుణ జూడవే ఓ యమ్మ
కాకుత్స్థరాముని కొమ్మ క ॥

అను పల్లవి:
శరణంటి ననుగానవమ్మ
జనకతనయ సీతమ్మ క ॥

చరణము(లు):
సరసిజాసను గన్నసాధ్వి నీమహిమలనెన్నగా
తరమే యింద్రాదులకైనా తథ్యమిది యని స్మృతులచే విన్నా క ॥

కలకంఠి నీ ముద్దులమోము కనుగొంటి నాదే భాగ్యము
ఎలనాగ నే నోచిననోము ఎన్న ఎవరి శక్యము ఓ యమ్మ క ॥

పతితపావననామ నీ భానువంశాబ్ధి సోముని
క్షితివిజయుని నేలిన ఘనుని చెలిమి చేసిన పరమకళ్యాణి క ॥

భద్రాద్రివాసుని కొమ్మ భద్రాద్రిశ్రీరామదాసుని కమ్మ
భద్రములొసగుమి అమ్మా భద్రం భవతు తే మాయమ్మ క ॥

See Also  108 Names Of Chinnamasta In Telugu