Karunincu Daivalalama Aho In English – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Karunincu Daivalalama Aho Lyrics ॥

సౌరాష్ట్ర – ఆది (త్రిపుట)

పల్లవి:
కరుణించు దైవలలామ అహో
పరమపావననామ పట్టాభిరామా క ॥

చరణము(లు):
అన్నవస్త్రము లిత్తుమనుచు దొర
లన్నారు మనిచెదమనుచు ఆయు
రన్నం ప్రయచ్ఛతియనుచు నూర
కున్నాను నీవే మాకున్నావనుచు క ॥

మరి యింతకాలమ్ముదనుక మిమ్ము
మరచితినని తప్పుతలచక మమ్ము
దరిజేర్చుడని వేడితిని మీది
శరణాగతత్రాణ బిరుదు కనుక క ॥

పరులను గొలుచుటకన్న ఇల భద్ర
గిరిరాఘవుల వేడుకొనుట ఇహ
పరములకు దారియని విన్టినే
దరహాసముఖ రామదాసపోష క ॥

Other Ramadasu Keerthanas:

See Also  Narayaniyam Astnavatitamadasakam In English – Narayaneyam Dasakam 98