Kata Kata Nidu Sankalpa Mettido Gani In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Kata Kata Nidu Sankalpa Mettido Gani Lyrics ॥

కాంభోజి – ఏక (-త్రిపుట)
పల్లవి:
కటకటనీదు సంకల్పమెట్టిదోగాని
నేనెంతవాడనురా రామ క ॥

నిటలాక్షుడు తొల్లి నీమాయ గనలేక
తటుకున నీ వలదగిలెను గనుక క ॥

చరణము(లు):
శరణన్న మునులను బిరబిర బ్రోచెడు
బిరుదు గలిగిన దొరవే ఓ రామ
పరిపరివిధముల మొరలిడ వినక న
న్నరమరచేసిన హరి నిన్నేమందు క ॥

భావజజనక నా భావమెరుగ వే
వేగమున జూడవే ఓ రామ
దేవాదిదేవ దేవ దీనశరణ్య
నీవే దిక్కని నిక్కము నమ్మితి క ॥

గీర్వాణనుత భద్రగిరివాస సర్వయో
గీశ్వరేశ్వర రామ ఓ రామ
సర్వాత్మ రామదాస హృదయాబ్జ నిలయ
సర్వాధార పరాకేల రామా క ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Nandiswara Ashtakam In Telugu