Kodandarama Kodandarama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ O Raghuvira ani ne Lyrics ॥

నాదనామక్రియ – ఏక (ఆనందభైరవి – తిశ్ర ఏక)

పల్లవి:
కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ కో

చరణము(లు):
నీదండనాకు నీవెందుబోకు వాదేలనీకు వద్దుపరాకు కో ॥

శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరోగ్యమిమ్ము కో ॥

జయ రఘువీర జగదేకశూర భయనివార భక్తమందార కో ॥

మణిమయభూష మహలక్ష్మితోష రణవిజయఘోష రమణీయవేష కో ॥

ఏలరావయ్య ఏమంటినయ్య పాలింపవయ్య ప్రౌఢిగనవయ్య కో ॥

తల్లివి నీవే తండ్రివి నీవే తాతవు నీవే దైవము నీవే కో ॥

అద్భుతకుండలామలదండ సద్గుణదండ సమరప్రచండ కో ॥

సరసిజనేత్ర సౌందర్యగాత్ర పరమపవిత్ర భవ్యచరిత్ర కో ॥

ఏ బుద్ధివీడు యెరుగనివాడు పాపడువీడు బడలియున్నాడు కో ॥

పాపను లేపు ప్రజలనుగల్పు యాపదబాపు యటుప్రీతిజూపు కో ॥

నమ్మిన చిన్నవాడితడన్న మమ్ములగన్న మాయన్నవన్న కో ॥

లేరుమీసాటి ఎవరుమీసాటి రారుమీసాటి రాజులమేటి కో ॥

దశరథబాల దాసానుకూల దశముఖకాల ధరణీశపాల కో ॥

మారుతభీమ మాల్యాభిరామ కల్యాణనామ కారుణ్యధామ కో ॥

మంజులభాష మణిమయభూష కుంజరపోష కువలయవేష కో ॥

పుట్టింపనీవె పోషింపనీవే ఫలమియ్యనీవె భాగ్యమునీవె కో ॥

శరణన్నచోట క్షమచేయుపూట బిరుదునీదౌట నెరిగినమాట కో ॥

మురళీలోల మునిజనపాల తులసీవనమాల తుంబురులోల కో ॥

రావయ్యవీని రక్షింతుగాని సేవచేసితిని స్వామి నీవని కో ॥

రావణభంగ రమణీయాంగ పావని తురంగ పాదాబ్జ గంగ కో ॥

See Also  108 Names Of Gauri 2 In Telugu

మందారహార మన్మథాకార మహితవిచార మౌక్తికహార కో ॥

వందనమయ్య వాదేలనయ్య దండనసేయ తగదుమీకయ్య కో ॥

లాలితహాస లక్ష్మీవిలాస పాలితదాస భద్రాద్రివాస కో ॥

శ్రీవిజయరామ శ్రీతులసిధామ పావననామ భద్రాద్రిరామ కో ॥

Other Ramadasu Keerthanas: