Kodandaramulu Mamugannavaru In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ O Raghuvira ani ne Lyrics ॥

ధన్యాసి – ఆది ( – తిశ్ర ఏక)

పల్లవి:
కోదండరాములు మముగన్నవారు
కుదురుగ మము పెంచి విడనాడలేరు కో ॥

చరణము(లు):
ముదముతో గూడుకొని తమ్మునితోడ ఖలులు
బాధించు వేళ నాకు భక్తితోడు కో ॥

సీతారామనామములే మా జిహ్వయందు యమ
దూతల బారద్రోలు దొడ్డమందు కో ॥

పట్టాభిరాముల చేపట్టినాము మేము
గట్టిగ యమునికి నామమిడినాము కో ॥

ప్రేమతో భద్రగిరీశ రామదాసుని
రామస్వామి వేగ రక్షింపుమయ్యా కో ॥

Other Ramadasu Keerthanas:

See Also  Dvadasha Jyotirlinga Smaranam In Telugu – Telugu Shlokas