Ksheerabdi Kanyakaku In Telugu

॥ Ksheerabdi Kanyakaku Telugu Lyrics ॥

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనమ్ ॥

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనమ్ ।
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనమ్ ॥

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనమ్ ।
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనమ్ ॥

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనమ్ ।
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనమ్ ॥

– Chant Stotras in other Languages –

Annamacharya Keerthanalu » Ksheerabdi Kanyakaku Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » » Tamil

See Also  Ullam Urugudaiya Murugaa In Tamil