Maruvakanu Ni Divyanama Smaranameppudu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Maruvakanu ni Divyanama Lyrics ॥

సురటి – త్రిపుట

పల్లవి:
మరువకను నీ దివ్యనామ స్మరణమెప్పుడు చేయుచుంటిని
సత్కృపను ఇక వరములిచ్చెడి స్వామివనుచును ఎందునను మీ
సరిగ వేల్పులు లేరటంచును మరిగ నే చాటుచుంటిని మ ॥

చరణము(లు):
రాతినాతిగ చేసినావు అజామిళునిపై కృప గలిగి ని
ర్హేతుకంబుగ బ్రోచితివి ప్రహ్లాదుని గాచితి వట సభను ద్రౌ
పతికి చీరలనొసగితివి సుంతైన నాపై దయను జూపవు మ ॥

లోకములు నీలోన గలవట లోకముల బాయవట నీవిది
ప్రకటముగ శ్రుతులెన్నడు చాటుట పరమ సంతోషమున వింటిని
ఇకను నీవే బ్రోవకున్నను ఎవరు నాకిక దిక్కు రామా మ ॥

దాసమానస పద్మభృంగ దేవసంతత చిద్విలాస
భాస సీతామానసోల్లాస భద్రశైలనివాస శ్రీరామ
దాసపోషక ఇంద్రనీల శుభాంగ పక్షితురంగ రామా మ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Shiva Sahasranama Stotram In Telugu