Medini Jeevula Gaava In Telugu

॥ Medini Jeevula Gaava Telugu Lyrics ॥

మేదిని జీవుల గావ మేలుకోవయ్యా ।
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ॥

తగుగోపికల కన్నుదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా ।
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ॥

ఘనదురితపు గలువలు వికసించె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా ।
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ॥

వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయుదోషరహిత మేలుకోవయ్యా ।
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Medini Jeevula Gaava Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Hymn To Kottai Ishvara In Tamil