Melaina Chitikena Vrelu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Melaina Chitikena Vrelu Lyrics ॥

ఆనందభైరవి – రూపక

పల్లవి:
మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు ॥

చరణము(లు):
బాలత్వముననేను బావినీళ్ళకుపోయి
కాలుబెట్టగ చిన్న తేలుపొడిచెనయ్య మే ॥

చలివచ్చెనని నొప్పిచేత దీనివేడిమి పాపిష్టి ఘాత
యీలాగునైన నే నేలాగు తాళుదు మూలమైన గురుమూర్తి పాదములాన మే ॥

మిక్కిలి సలుపుచున్నది రాముగ్రక్కున నాదరించినది
వెక్కసపెట్టుచు కడతేరనీయదు మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను మే ॥

దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులుచేసినరీతి చేసెదవా
పుడమిలోపల భద్రగిరి రామదాసుని బడనీయక కాపాడు తండ్రివి నీవె మే ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Harihara Ashtottara Shatanama Stotram In Telugu