Muccatainanaadavemira Kodandapani In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Muccatainanaadavemira Kodandapani Lyrics ॥

నాదనామక్రియ – రూపక

పల్లవి:
ముచ్చటైననాడవేమిరా కోదండపాణి ముచ్చటైననాడవేమిరా ము ॥

చరణము(లు):
ముచ్చటైననాడవేమి ముదమునను నీపాదములను
మరువక నెల్లప్పుడు నా మదిని విడువక దలచెదనే ము ॥

ఎందాక నేవేడుకొందు ఏమిచేయుదు నీవేళయందు
ఎందుకు చేరితి నిను జేపట్టుమిక నన్ను ము ॥

పండ్రెండేండ్లాయెను నేను బందిఖానలోనుండి
నల్లులు దోమలచేత నలుగుచున్నది దేహము ము ॥

చైత్రవైశాఖములిప్పుడు చెప్పతరముగాదు
ఎంతో తహశీలుసేయ నాకు జామీనైనా యెవ్వరు లేరు ము ॥

తానీషాగారు వచ్చి తహశీలు చేసెదరు
కాసులుపంపించి నన్ను కరుణచేసి విడిపించు ము ॥

నే నొక్కడను మీకు సుంతనాపై నెనరులేదు
మాతల్లి సీతమ్మకైన మనవిచెప్పకెటుబోతివో ము ॥

ఒంటరిగనున్న నింటిదగ్గర ఎవ్వరు జంటతో
సీతారామలక్ష్మణులు వెంటనే కూడివచ్చి ము ॥

వేమారు శ్రీభద్రాచల రామస్వామి మీరిప్పుడు
రామదాసుని చేపట్టి రక్షింపకయున్నా ము ॥

Other Ramadasu Keerthanas:

See Also  Ramuni Varamu Makemi In English – Sri Ramadasu Keerthanalu