Nallani Meni In Telugu

॥ Nallani Meni Telugu Lyrics ॥

నల్లని మేని నగవు చూపుల వాడు ।
తెల్లని కన్నుల దేవుడు ॥

బిరుసైన దనుజుల పింఛమణచినట్టి ।
తిరుపు కైదువ తోడి దేవుడు ।
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి ।
తెరవు చూపినట్టి దేవుడు ॥

నీటగలసినట్టి నిండిన చదువులు ।
తేట పరచినట్టి దేవుడు ।
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు ।
తీట రాసినట్టి దేవుడు ॥

గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న ।
తిరువేంకటాద్రిపై దేవుడు ।
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి ।
తెరచి రాజన్నట్టి దేవుడు ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Nallani Meni Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Narayaniyam Satsaptatitamadasakam In Tamil – Narayaneyam Dasakam 76