Namminavarini Mosamuceeyuta In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Namminavarini Mosamuceeyuta Lyrics ॥

భైరవి – తిశ్ర ఏక

చరణము(లు):
నమ్మినవారిని మోసముచేయుట న్యాయముగాదుర నాతండ్రి
సమ్మతమౌనా చూచేవారికి చక్కన గాదుర రఘునాథా న ॥

విన్నారంటే పరులందరు నిను విడనాడుదురే రఘునాథా
అన్నా నీకిది చిహ్నము గాదుర ఆదుకోవలెనురా రఘునాథా న ॥

నిన్నా నేడా నిన్ను కొలిచేది నీకేల తెలియదు రఘునాథా
ఎన్నాళ్ళీ కష్టము పడుదు నిక తాళనురా రఘునాథా న ॥

డబ్బులకై నేను దెబ్బలు పడినది దబ్బర గాదుర రఘునాథా
నిబ్బరముగ రామదాసు నేలుచు మాయబ్బ తాళనురా రఘునాథా న ॥

Other Ramadasu Keerthanas:

See Also  Surya Gita In Telugu