భద్రాచల రామదాసు కీర్తనలు
॥ Kalaye Gopalam Kasturitilakam Lyrics ॥
మాయామాళవగౌళ – ఏక (మణిరంగు – త్రిపుట)
పల్లవి:
నందబాలం భజరే బృందావన వాసుదేవం నం ॥
చరణము(లు):
జలజసంభవాది వినుత చరణారవిందం
లలిత మోహన రాధావదన నళినమిళిందం నం ॥
నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందం
ఘటితశోభిత గోపికాధర మకరందం నం ॥
గోదావరీతీర వాసగోపికా కామం
ఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం నం ॥