Narayana Achyuta In Telugu

॥ Naraayanaachyuta Telugu Lyrics ॥

నారాయణాచ్యుతానంత గోవింద హరి ।
సారముగ నీకునే శరణంటిని ॥

చలువయును వేడియును నటల సంసారంబు
తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ ।
ఫలములివె యీ రెండు పాపములు పుణ్యములు
పులుసు దీపును గలపి భుజియించినట్లు ॥

పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు
తగుమేను పొడచూపు తనుదానె తొలగు ।
నగియించు నొకవేళ నలగించు నొకవేళ
వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు ॥

యిహము పరమును వలెనె యెదిటికల్లయు నిజము
విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని ।
సహజ శ్రీ వేంకటేశ్వర నన్ను కరుణింప
బహువిధంబుల నన్ను పాలించవే ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Naraayanaachyuta Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Gayatri Sahasranama Stotram In Tamil