Narahari Nammaka Narulanu Nammite In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Narahari Nammaka Narulanu Nammite Lyrics ॥

జంఝాటి – ఆట (ఝంఝోటి- ఆది)

పల్లవి:
నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా న ॥

అను పల్లవి:
చెఱకులుండగ వెఱ్ఱి చెఱకులు నమలితె జిహ్వకు రుచిపుట్టునా ఓమనసా న ॥

చరణము(లు):
కాళులుండగ మోకాళ్ళతో నడచితె కాశికిపోవచ్చునా ఓమనసా
నీళ్ళుండగ నుమ్మి నీళ్ళను మ్రింగితే నిండుదాహము దీరునా ఓమనసా న ॥

కొమ్మయుండగ గొయ్యబొమ్మను గలసితె కోరిక కొనసాగునాఓమనసా
అమ్మయుండగ పెద్దమ్మను యడిగితె నర్థము చేకూరునా ఓమనసా న ॥

అన్నముండగ గుల్లసున్నము తింటె యాకలి వెతదీరునా ఓమనసా
కన్నెలుండగ చిత్రకన్నెల గలసిన కామపువ్యథ దీరునా ఓమనసా న ॥

క్షుద్రబాధలచే నుపద్రవపడువేళ నిద్రకంటికి వచ్చునా ఓమనసా
భద్రగిరీశుపై భక్తిలేని నరుడు పరమును గననేర్చునా ఓమనసా న ॥

Other Ramadasu Keerthanas:

See Also  Evaru Dusincinanemi Mari Evaru In Telugu – Sri Ramadasu Keerthanalu