Narayana Narayana Jayagopala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Narayana Narayana Jayagopala Lyrics ॥

శంకరాభరణ – ఆది

పల్లవి:
నారాయణ నారాయణ జయగోపాల హరే కృష్ణ నా ॥

చరణము(లు):
శ్రీకౌస్తుభమణిభూష శృంగార మృదుభాష నా ॥

నందవరకుమార నవనీత దధిచోర నా ॥

కమనీయ శుభగాత్ర కంజాతదళనేత్ర నా ॥

కరుణాపారవార వరుణాలయ గంభీర నా ॥

మంజులకుంజభూష మాయామానుష వేష నా ॥

అజభవనుత కంసారే అచ్యుతకృష్ణ మురారే నా ॥

మురళీగాన వినోద వ్యత్యస్తపాదారవింద నా ॥

యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నా ॥

వరభద్రాచలవాస పాలితరామదాస నా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Bhuvaneswari Ashtottara Shatanama Stotram In Telugu