Natappulanni Ksamiyincumi Jagannatha In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Natappulanni Ksamiyincumi Jagannatha Lyrics ॥

అసావేరి – ఆది

పల్లవి:
నాతప్పులన్ని క్షమియించుమీ జగన్నాథ నీవాడ రక్షింపుమీ నా ॥

అను పల్లవి:
పాతకుడని ఎంచక పోషించు దాతవనుచు నీపదములే నమ్మితి నా ॥

ఈయెడ నానేరమెంచక హితవున ద్వేషములెంచకు మ్రొక్కెద

చరణము(లు):
చేయరాని పనులెన్నోజేసితి కాయతీగకు ఎక్కువకాదుగదా నా ॥

కడుపున బుట్టిన తనయుడు ఎంత దుడుకుతనము జేసినగాని
కొడుకా రమ్మని చేకొనుగాని నూతిలోపడద్రోయునా ఎంత తండ్రి ఎవరైన నా ॥

దాసుని మనవిని వినుము చక్రధర వాసవనుత నన్నేలుకొంటివా
నాస్వామి నమ్మితిని భద్రాద్రినివాసుడ రామదాసు నేలుతండ్రి నా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Doorvesha Stotram In Telugu – Telugu Shlokas