Navanita Chora Namo Namo In Telugu

॥ Navanita Chora Namo Namo Telugu Lyrics ॥

నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో ॥

హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో ।
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో ॥

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో ।
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమో నమో ॥

వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో ।
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో ॥

– Chant Stotra in Other Languages –

Annamacharya Keerthanalu » Navanita Chora Namo Namo Lyrics in Sanskrit » English » Bengali » Kannada » Malayalam » Tamil

See Also  Sri Venkateswara Suprabhatam In Gujarati