Nee Sankalpam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Nee Sankalpam Lyrics ॥

పల్లవి:
నీ సంకల్పం బెటు వంటిదో గన నెంత వాడరా రామ నీ
వాసి తరిగి నీ దాస జనులు భువి కాశ పడిన యా ఘన మెవ్వరిదో నీ ॥

చరణములు:
బ్రోచిన మరి విడ జూచిన నీ క్రుప గాచి యుండు గాని
తోచీ తోచకను తొడరి కరంబుల చాచి పరుల నే యాచన సేయను నీ ॥

పటు తరముగ నీ మటు మాయలకును నెటువలె నోర్తును
చటుల తరంబుగ జలగు భవాంబుధి నెటు దాటుదు నేనెవరిని దూరుదు నీ ॥

భావజ రిపు నుత పరమ పురుష నీ భావము తెలియదుగ
దేవ దేవ నీ సేవక జనులకు సేవకుడను నను గావుము మ్రొక్కెద నీ ॥

దరి జేర్చెదవని ధైర్యము చే నీ దరి చేరితిని గాని
అరసి బ్రోవగదె యారడి పెట్టుట యెరుగ నైతి నా దొరవను కొంటి నీ ॥

శరణాగత రక్షణ భవ సాగర తరణ రిపు హరణ
కరుణ జూదు భద్రాద్రి నివాసా అర మర చేయకు హరి నిను నమ్మితి నీ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Nee Sankalpam Lyrics » English

Other Ramadasu Keerthanas:

See Also  Heramba Sri Ganapati Stotram In Telugu