Ninnu Nammi Unnavadanu Oh In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ninnu Nammi Unnavadanu Oh Lyrics ॥

నాదనామక్రియ – ఆది (మాయామాళవగౌళ – త్రిపుట)

పల్లవి:
నిన్నునమ్మియున్నవాడను ఓ రామ ని ॥

చరణము(లు):
నిన్ను నమ్మినవాడ పరులను వేడనిక
మన్ననజేసి పాలింపవే ఓరామా ని ॥

బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖము
వెతనొందగ జాలనే ఓరామా ని ॥

మానము విడిచి కసుమాల పొట్టకొరకై
మానవుల వెంబడింతునే ఓరామా ని ॥

సతతము రక్షించు చతురత నీకున్నప్పుడు మది
చంచలింప నేటికే ఓరామా ని ॥

సతతము భద్రాద్రిస్వామి శ్రీరామదాస
పతివై నన్నాదరింపవే ఓరామా ని ॥

Other Ramadasu Keerthanas:

See Also  Rama Rama Sita Rama In Telugu – Sri Ramadasu Keerthanalu