Ninnu Ponichedana Sita Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Ninnu Ponichedana Sita Rama Lyrics ॥

మధ్యమావతి – చాపు ( -త్రిపుట)

పల్లవి:
నిను బోనిచ్చెదనా సీతారామ
నిన్ను బోనిచ్చెదనా సీతారామ ని ॥

అను పల్లవి:
నిన్ను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏ
మైనగాని నా కనులాన శ్రీరామా ని ॥

చరణము(లు):
రట్టు చేసెద నిన్ను అరికట్టుదునింక మొర
బెట్టుకోరా దిక్కు గలిగితే రామ ని ॥

గట్టిగ నీ పదకమలము లెప్పుడు
పట్టి నా మదిలో గట్టియుందును శ్రీరామా ని ॥

పడిపడి మీ వెంటబడి తిరుగ నెంతో
జడియను నీవెందు జరిగెదవురా రామ ని ॥

తడయక నీ తల్లితండ్రులు వచ్చినగాని
విడిచిపెట్టిన నీకొడుకునురా శ్రీరామా ని ॥

మా వాడని మొగమాటము లేక నే
సేవజేసి రవ్వ సేయుదురా రామ ని ॥

నీవు భద్రాచల నిలయుడవై నన్ను
కావవయ్యా రామదాస పోషక శ్రీరామా ని ॥

Other Ramadasu Keerthanas:

See Also  Sri Veda Vyasa Ashtakam In Telugu