O Raghuvira Ani Ne In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ O Raghuvira ani ne Lyrics ॥

మధ్యమావతి – ఆది

పల్లవి:
ఓ రఘువీరా యని నేబిలిచిన
నోహో యనరాదా రామ
సారెకు వేసారి నా మది యన్యము
చేరదు యేరా ధీరా ఓ ॥

చరణము(లు):
నీటజిక్కి కరిమాటికి వేసరి
నాటకధర నీ పాటలు బాపగ
మేటి మకరితల మీటి కాచుదయ
యేటికి నాపై నేటికిరాదో ఓ ॥

మున్ను సభను నాపన్నత వేడుచు
నిన్ను కృష్ణయని యెన్నగ ద్రౌపది
కెన్నొ వలువలిడి మన్నన బ్రోచిన
వెన్నుడ నామొర వింటివొ లేదో ఓ ॥

బంటునైతినని యుంటె పరాకున
నుంటివి ముక్కంటి వినుత నామ
జంట బాయకను వెంట నుండుమని
వేడితి భద్రాచలవాసా ఓ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – O Raghuvira ani ne Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Paluke Bangaramayenaa » Sri Ramadasu Movie Song In English