Oh Raghunandana Rara Ragava In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Oh Raghunandana Rara Ragava Lyrics ॥

కానడ -ఆది

పల్లవి:
ఓ రఘునందన రారా రాఘవ శ్రీరఘునందన రారా రామ
ఆశ్రిత సముదయ మందర రామ శ్రీరఘునందన రారా ఓ ॥

చరణము(లు):
యాది యుంచుమీ నామీదను నీకే దయ రావలెగాక రామ
పాదములకు నే మ్రొక్కెద నాకు ప్రత్యక్షము కారాదా రామ ఓ ॥

నీ కారుణ్యము తోను నేను నిర్వహింపతలచెదను రామ
నీకే మరులు కొన్నాను నీనిద్దంపు మోము చూచెద రామ ఓ ॥

సరసిజ భవనుత శౌరి నీ సరి దైవములిక యేరి రామ
శరణంటిని నే నిన్నే గోరి శరజాల శరాసనధారి రామ ఓ ॥

సతతము నామదిలోను నిన్ను సంస్మరింపతలచెదను రామ
గతినీవని నమ్మినాను యే గతి బ్రోచిన నీవేను రామ ఓ ॥

వరభద్రాద్రినివాస భావజ శతకోటి విలాసా రామ
పరమానందవికాసా పరిపాలిత శ్రీరామదాస ఓ ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Oh Raghunandana Rara Ragava Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Satya Vratokta Damodara Stotram In Telugu