Pahimaam Sriraamayante Palukanaitivi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Pahimaam Sriraamayante Palukanaitivi Lyrics ॥

యదుకులకాంభోజి – ఆది

పల్లవి:
పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీ
స్నేహ మిట్టిదని నే చెప్పనోహో హోహో హోహో ఓహో పా ॥

చరణము(లు):
ఇబ్బంది నొందిన యా కరి బొబ్బపెట్టినంతలోనె
గొబ్బున గాచితివట జాగుసేయక ఎంతో
నిబ్బరముతోనే నీకు కబ్బమిచ్చి వేడుకొన్న
తబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పా ॥

సన్నుతించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని
పన్నగశాయి విని నే విన్నవించితిని
విన్నపము వినక యెంతో కన్నడ జేసెదవు రామ
యెన్నటికి నమ్మరాదు రన్న న్నన్నన్నన్నన్నా పా ॥

చయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను
వెయ్యారు విధముల రామ వినుతిచేయ సాగితిని
యియ్యెడను రామదాసుని కుయ్యాలించి ప్రోవకున్న నీ
యొయ్యార మేమనవచ్చు నయ్య య్యయ్యయ్యయ్యయ్యయ్యో పా ॥

Other Ramadasu Keerthanas:

See Also  Devyashtakam In Telugu