Paluke Bangaramayena In Telugu – Sri Ramadasu Keerthanalu

॥ Paluke Bangaramayena Lyrics ॥

పల్లవి:
పలుకే బంగారమాయెరా కోదండపాణి॥
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని స్వామి
॥ పలుకే బంగారమాయెరా ॥

చరణం1:
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుతను
కరుణించి బ్రోచితివని చెర నమ్మితిని తండ్రి
॥ పలుకే బంగారమాయెరా ॥

చరణం2:
రాతిని నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
॥ పలుకే బంగారమాయెరా ॥

చరణం3:
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాద
కరుణించు భద్రాచల వరరామదాసపోష
॥ పలుకే బంగారమాయెరా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Paluke Bangaramayena Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Sri Surya Mandala Ashtakam 2 In Telugu