Pavana Rama Nama Sudharasa Panamu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Pavana Rama Nama Sudharasa Panamu Lyrics ॥

కాపి- ఆది

పల్లవి:
పావన రామనామ సుధారసపానముజేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో పా ॥

చరణము(లు):
దాసులగని సంతోషమ్మున తన దాసోహమ్మను టెన్నటికో
భూసుతకును నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో పా ॥

చంచలగుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నా కెన్నటికో పా ॥

ఇనవంశాంబుధి చంద్రుడు కృప నిష్టార్థము లొసగేదెన్నటికో
కనకచేలు కరుణాలవాలుని కన్నుల జూచేదెన్నటికో పా ॥

వంచన లేకను భద్రాద్రీశుని వర్ణన చేసేదెన్నటికో
అంచితముగ రామదాసుడ ననుకొని ఆనందించేదెన్నటికో పా ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Pavana Rama Nama Sudharasa Panamu Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  Argala Stotram In Telugu