Poyyetappudu Ventaradu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Poyyetappudu ventaradu Lyrics ॥

నాదనామక్రియ – ఆది

పల్లవి:
పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కైన
వెయ్యారులుదాచుకొనియు నర్థులకియ్యలేని లోభుల కయ్యయ్యో పొ ॥

చరణము(లు):
ఇచ్చిన మాత్రంబిచ్చును దైవము హెచ్చడిగిన రాదు
వచ్చేటప్పుడు వెంటనేమైన తెచ్చుకొన్నదిలేదు పొ ॥

హెచ్చుగనిది తెలియని పామరులు దురాశను తగులుకొని
యిచ్చట నార్జించిన ధనమెచ్చట కెత్తుకపొయ్యే రయ్యయ్యో పొ ॥

తనువును రక్షించుటకై మూలమూలలందును ధనము దాచెదరు
తనువును సుతబాంధవులు స్థిరమనితలచి గానగలేరు పొ ॥

తలతురు వారలు పశుసుతాదులు తనవని భ్రమసేరు
తనవారెక్కడ తానెక్కడనో తనువు విడిచి యాజీవు డొంటిగ పొ ॥

ఇరువుగ తొలిజన్మమున పేదలకియ్యని దోషమున
తిరిపెము లెత్తెడివారిని గాంచియు దెలియక యున్నారు పొ ॥

పరులకు బలిభిక్షంబులు బెట్టని పరమలోభులిలను
ధరలో వేంకటవిఠలుని దలపక ధనమదాంధమున దగిలి మానవుడు పొ ॥

Other Ramadasu Keerthanas:

See Also  Vishnu Ashtottara Sata Divyasthani Yanama Stotram In Telugu