Pratyaksamuganu Ivela In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Pratyaksamuganu ivela Lyrics ॥

సావేరి – ఆది

పల్లవి:
ప్రత్యక్షముగాను ఈవేళ బ్రతికించితివయ్యా
సత్యము సత్యము నీవే నాదైవము రామచంద్రా ప్ర ॥

చరణము(లు):
ఝుమ్మను చీకటిలో వాన ఝరఝర గురియగను
ఇమ్ము సొమ్ములనిమ్మంటిని గుమ్మని దలచగాను
సొమ్మసిల్లుచును నా చిత్తము సొలసి జిల్లుమనగా
నమ్మదగిన నాదైవము నీవని నమ్మినందుకిపుడు ప్ర ॥

ఉబ్బలిలో దారినెరుగక తబ్బిబ్బు నడువగను
అబ్బురముగ నాకు చోరులు ముందుగనబడి యొరదీయగా
గొబ్బున వస్త్రముచే నాపై దెబ్బవేయరాగ
అబ్బాయనగా శ్రీరామాయని నే శరణంటిని యపుడు ప్ర ॥

అంత నహోవింతా చోరుని రంతు యెంతో వింతా
పంతముచెడి యా చోరులు పారిరి పరమపురుష స్వామీ
అంతట వేగమున నేను సుంత భయములేక
దంతిరక్షకా దాసపోషకా దయగల నా స్వామి ప్ర ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Sri Vedavyasa – Ashtottara Shatanamavali In Telugu