Pritinaina Pranabhitinaina Kalimi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Pritinaina Pranabhitinaina Kalimi Lyrics ॥

సావేరి – ఆది (కాపి- త్రిపుట)

పల్లవి:
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ది ॥

చరణము(లు):
ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమి
చేతనైనా మిమ్మేతీరుగ దలచిన ఆ ది ॥

అర్థాపేక్షను దినము వ్యర్థము కాకుండ
సార్థకముగ మిమ్ము ప్రార్థనజేసిన ఆ ది ॥

నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు
వరుని పదముల నమరపూజించిన ఆ ది ॥

మృదంగతాళము తంబురశ్రుతిగూర్చి
మృదురాగము కీర్తన పాడినను విన్న ఆ ది ॥

ఘనమైన భక్తిచే పెనగొని యేవేళ
మనమున శ్రీరాముని చింతించిన ఆ ది ॥

భక్తులతో ననురక్తిని గూడుక
భక్తిమీరగను భక్తవత్సలుపొగడు ది ॥

దీనశరణ్య మహానుభావ యో గానలోల
నను కరుణింపుమని కొలుచు ఆ ది ॥

వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని
వాసుదేవు వాంఛతోను బాడెడి ఆ ది ॥

అక్కరతోడ భద్రాచలమునను
చక్కని సీతారాముల జూచిన ఆ ది ॥

Other Ramadasu Keerthanas:

See Also  Narayaniyam Satsastitamadasakam In Telugu – Narayaneyam Dasakam 66